ధనుష్‌ బర్త్‌డే: ఫ్యాన్స్‌కి ‘సార్‌’ టీం సర్‌ప్రైజ్‌! | Happy Birthday Dhanush: First Look Release From Dhanush Sir Movie | Sakshi
Sakshi News home page

Happy Birthday Dhanush: ధనుష్‌ బర్త్‌డే: ఫ్యాన్స్‌కి ‘సార్‌’ టీం సర్‌ప్రైజ్‌!

Jul 28 2022 12:09 PM | Updated on Jul 28 2022 12:19 PM

Happy Birthday Dhanush: First Look Release From Dhanush Sir Movie - Sakshi

అక్టోబర్‌లో ‘సార్‌’ థియేటర్స్‌కు వస్తారు. ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సార్‌’ (తమిళంలో ‘వాత్తి’). ఇందులో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌లతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. గురువారం (జూలై 28) ధనుష్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘సార్‌’ సినిమాలో ధనుష్‌ ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

చదవండి: నాకు లైన్‌ వేయడం ఆపు అనన్య.. విజయ్‌ రిక్వెస్ట్‌

చిత్రదర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘విద్యా వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ధనుష్‌ లెక్చరర్‌గా కనిపిస్తారు. నేడు ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్‌ చేస్తున్నాం. ధనుష్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ మర్చిపోలేనిది’’ అన్నారు. ‘‘అక్టోబరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నాగవంశీ. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement