breaking news
Dhanush birthday
-
చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు
Happy Birthday Dhanush కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. వర్సటైల్ యాక్టర్ ధనుష్ 43వ బర్డ్‌డే సందర్భంగా ఆయన ఆస్తులు, వందల కోట్ల సామ్రాజ్యంపై నెట్టింట ఆసక్తి నెలకొంది.ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరైన వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా (సినీ పేరు: ధనుష్) తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అసలు ధనుష్ చెఫ్ (వంటమనిషి) కావాలను కున్నప్పటికీ, ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ కోరిక మేరకు కుటుంబ సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నటనలోకి అడుగుపెట్టారు.2002లో తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో వచ్చిన 'తుళ్లువదో ఇళమై' సినిమాతో ధనుష్ ఎంట్రీ ఇచ్చారు. 'పొల్లాదవన్', 'ఆడుకాలమ్', 'అనేగన్', 'మారి', 'వాతి' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సత్తా చాటుకున్నారు.'కొలవెరి డి' ప్రభంజనం2011లో వచ్చిన ఆయన పాట "వై దిస్ కొలవెరి డి" ధనుష్ జీవితంలో ఒక పెద్ద మైలు రాయి అని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి భారతీయ పాటగా చరిత్ర సృష్టించింది.బాలీవుడ్ ఎంట్రీ2013లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'రాంఝణా' సినిమాతో హిందీలోకి అడుగుపెట్టి, ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్ వంటి నటులతో కలిసి 'ది గ్రే మ్యాన్' హాలీవుడ్ చిత్రంలో కూడా ఆయన నటించారు.ధనుష్ నెట్ వర్త్ లైఫ్‌స్టైల్ ఆసియా (2025) అంచనా ప్రకారం ధనుష్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 230 కోట్లు. వండర్‌బార్ ఫిల్మ్స్ (Wunderbar Films): 2010లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ ద్వారా 'పా పాండి', 'కాలా', 'మారి', 'వడ చెన్నై', 'ఇడ్లీ కడై' సహా 20కి పైగా సినిమాలను నిర్మించారు. ఫిల్మ్ ప్రొడక్షన్ కాకుండా ఇతర ఆర్థిక నిధులు, పోర్ట్‌ఫోలియోలను నిర్వహించే కార్పొరేట్ వ్యాపార సంస్థ ధనుష్ గ్లోబల్ వెంచర్స్‌ను కూడా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ. 20 -35కోట్లుప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 20 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.లగ్జరీ ఇళ్లు, కార్లు చెన్నైలోని అత్యంత ఖరీదైన పోయెస్ గార్డెన్ ప్రాంతంలో 19,000 చదరపు అడుగుల్లో నిర్మించిన 4 అంతస్తుల భవనం. దీని విలువ సుమారు రూ. 150 కోట్లు. దీంతో పాటు చెన్నై ఆళ్వార్‌పేట్‌లో రూ. 18 కోట్ల విలువైన మరొక ఆధునిక ఇల్లు ఉంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls-Royce Ghost), జాగ్వార్ XE, మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్ HSE, ఫోర్డ్ మస్టాంగ్ వంటి విలాసవంతమైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ధనుష్ (Dhanush) ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిభావంతులైన, విలక్షణమైన నటుల్లో ఒకరిగా పేరుగాంచారు. సాంప్రదాయ హీరోల బాడీ లాంగ్వేజ్‌కు భిన్నంగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్‌ను ఏర్పరుచుకున్నారు. బక్కపల్చగా అమాయకంగా ఉన్నట్టు కనిపించినా నిప్పులు చెరిగే కళ్లతో, డైలాగ్ డెలివరీ, సహజమైన నటనలో మాత్రం ఆయనకు ఆయనే సాటి. ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఓమ్' (Om - Chapter 1: The Blood Wood) 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలకానుందని భావిస్తున్నారు. -
ధనుష్ బర్త్‌డే: ఫ్యాన్స్‌కి ‘సార్’ టీం సర్ప్రైజ్!
అక్టోబర్‌లో ‘సార్’ థియేటర్స్‌కు వస్తారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’). ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌లతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. గురువారం (జూలై 28) ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సార్’ సినిమాలో ధనుష్ ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. చదవండి: నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ చిత్రదర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘విద్యా వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ధనుష్ లెక్చరర్‌గా కనిపిస్తారు. నేడు ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నాం. ధనుష్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిది’’ అన్నారు. ‘‘అక్టోబరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నాగవంశీ. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. #Vaathi #Sir pic.twitter.com/2NAo1ayEv2 — Dhanush (@dhanushkraja) July 27, 2022 -
కామ్ గా పుట్టినరోజు జరుపుకున్న యువ హీరో
చెన్నై : కోలీవుడ్ యువ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ 31వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అతడు తన పుట్టినరోజు వేడుకల్ని కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య ఆదివారం రాత్రి జరుపుకున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం 'షమితాబ్' ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అతడి సరసన కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బర్త్‌డే సందర్భంగా ధనుష్ తన తల్లిదండ్రులు, భార్య ఐశ్వర్యతో గడిపేందుకు ముంబయి నుంచి చెన్నై వచ్చాడు. ఈ సందర్భంగా ఐశ్వర్య ...ధనుష్ కు బర్త్డై పార్టీ ఏర్పాటు చేసి సర్ప్రయిజ్ చేసినట్లు సమాచారం. పుట్టినరోజు పార్టీలో కుటుంబ సభ్యులతో పాటు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్, అతని సతీమణి గీతాంజలి, హీరో శింబు, శ్రియ, అమలాపాల్, సురభి తదితరులు అ పార్టీలో హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 26కేజీల కేక్‌ను ధనుష్ కట్ చేసాడు. ఇక ఈ సంవత్సరం ధనుష్‌కు ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఓవైపు బాలీవుడ్లో దూసుకుపోవటంతో పాటు, ధనుష్ నిర్మించి, నటించిన 'వేలై ఇల్లా పట్టాదారి' చిత్రం విజయబాటలో పయనిస్తోంది. గత వారం విడుదలైన ఈచిత్రం ఇప్పటికే రూ. 20 కోట్లు వసూలు చేసింది.


