వికాస్‌ దూబే జీవితం ఆధారంగా వెబ్‌సిరీస్‌ | Hansal Mehta To Directs Thriller Web Series On Gangster Vikas Dubey | Sakshi
Sakshi News home page

‘ఇందులో ఓ పొలిటికల్‌ థ్రీల్లర్‌ పాయింట్‌ ఉంది’

Aug 10 2020 5:18 PM | Updated on Aug 10 2020 10:26 PM

Hansal Mehta To Directs Thriller Web Series On Gangster Vikas Dubey - Sakshi

ముంబై: ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే జీవితం ఆధారం ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. థ్రీల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌కు బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నాడు. అత్యంత కరుడుగట్టిన నేరస్థుడు వికాస్‌ దూబే నిజ జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్నందున ఈ సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత శైలేష్ ఆర్ సింగ్ అధికారిక అనుమతులు కూడా పొందినట్లు తెలుస్తోంది. (చదవండి: ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన దూబే?!)

దీనిపై దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ... తాము తీయబోయే ఈ థ్రీల్లర్‌ వెబ్‌ సిరీస్‌ అంత్యంత ఆసక్తికరంగా ఉండబోతుందన్నారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఉదంతంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్ ఉందని, దానిని మేము ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పాడు. అది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు ఇది ప్రస్తుత సమాజాన్ని కూడా చూపిస్తుందన్నాడు. ఇటీవల యూపీ పోలీసుల చేతిలో హతమైన వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌ వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన రోజుల వ్యవధిలోనే పోలీసుల తూటాకు వికాస్‌ దూబే  బలయ్యాడు. (చదవండి: ‘జీపులో ఉన్న అందరిని చంపుతాను’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement