వికాస్‌ దుబే, కానిస్టేబుల్‌ మధ్య ఫోన్‌ సంభాషణ

Call Between Vikas Dubey and Cop Goes Viral - Sakshi

లక్నో: కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేని ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. చనిపోవడానికి ముందు తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడి చేసి ఎనిమిది మందిని చంపేశాడు. దాంతో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. తాజాగా వికాస్‌ దుబేకు, ఓ పోలీసు కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ ఫోన్‌ కాల్‌‌ వికాస్‌ దుబే, పోలీసులపై దాడి చేయడానికి ముందు రోజు జరిగినట్లు సమాచారం. వికాస్‌ దుబేకు, చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ రాజీవ్‌ చౌదరికి మధ్య ఈ సంభాషణ జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. (22 ఏళ్ల తర్వాత అదే సీన్‌ రిపీట్‌, కానీ..)

దీనిలో దుబే, పోలీసు అధికారితో ‘నా మీద పెద్ద కుంభకోణాన్ని మోపబోతున్నారని తెలిసింది. అయితే నాతో చాలేంజ్‌ చేసిన ఆ వ్యక్తికి ఓ విషయం అర్థం అయ్యేలా చేయబోతున్నాను. జీపులో ఉన్న అందరిని హతమారుస్తాను. దీని కోసం జీవితాంతం జైలులో ఉండటానికి కూడా నేను సిద్ధమే. ఇప్పుడు అతడు వికాస్‌ దుబే టార్గెట్‌. అతడిని చంపేవరకు ఇంటికి తిరిగి వెళ్లను’ అన్నాడు. అయితే వికాస్‌ ఎవరి గురించి మాట్లాడాడు.. అనే విషయం గురించి స్పష్టత లేదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top