మ్యూజిక్ డైరెక్టర్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్! | Sakshi
Sakshi News home page

GV Prakash Kumar: జీవీ ప్రకాశ్ కుమార్ మూవీ.. టైటిల్ ఫిక్స్!

Published Sun, Dec 3 2023 4:52 PM

GV Prakash Kumar Latest Movie Title Fixed In Kollywood  - Sakshi

సంగీతం,నటనతో సక్సెస్‌ఫుల్‌గా రాణిస‍్తున్న జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా ప్రస్తుతం 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కింగ్‌స్టర్‌ అనే టైటిల్‌ను మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్‌కుమార్‌కు చెందిన పార్లర్ యూనివర్శల్‌ పిక్చర్స్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి కథ, దర్శకత్వం కమల్‌ప్రకాష్‌ నిర్వహిస్తున్నారు.  ఈ చిత్రంలో జీవీకి జోడీగా నటి దివ్యభారతి నటిస్తున్నారు.

ఇంతకుముందు ఈ జంట నటించిన బ్యాచిలర్‌ మంచి విజయాన్ని సాధించింది. కింగ్‌స్టర్‌ చిత్రం షూటింగ్‌ను నవంబర్‌ 10వ తేదీ నటుడు కమలహాసన్‌ చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో జీవీ ప్రకాష్‌కుమార్‌ మత్స్యకారుడిగా నటించడం మరో విశేషం.

సముద్రంలోని రహస్యాలను కనుగొనే యువకుడిగా ఈయన నటిస్తున్నారు. ఫుల్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో రూపొందుతోంది. కథానాయకుడి గెటప్‌ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంది. దీంతో ఆయన అభిమానులు చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్‌స్టర్‌ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement