జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: సహ నటుడు | Gulshan Devaiah Clarify His Comments On Janhvi Kapoor, Deets Inside | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జాన్వీతో నాకు ఫ్రెండ్‌షిప్ లేదు.. కానీ!

Jul 23 2024 12:31 PM | Updated on Jul 23 2024 1:50 PM

Gulshan Devaiah Clarify His Comments On Janhvi Kapoor

సాధారణంగా సినిమా యాక్టర్స్ చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ కొన్నిసార్లు చాలా సాధారణంగా మాట్లాడినా సరే దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య.. హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అవి కాస్త వైరల్ అయిపోయాయి. ఇప్పుడు దీనికి సదరు నటుడు మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)

జాన్వీ కపూర్‌తో కలిసి నటించాను గానీ తనకు వైబ్ రాలేదని గుల్షన్ దేవయ్య అన్నాడు. దీనిపై జాన్వీ కూడా స్పందిస్తూ.. అవును అతడు చెప్పింది నిజమేనని, షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక్కసారి కూడా కలిసి కూర్చోలేదని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో గుల్షన్ ఏదో తప్పు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో తన మాటలపై క్లారిటీ ఇచ్చాడు.

'జాన్వీ కపూర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదని చెప్పానంతే. అది మా తప్పు కాదు. జాన్వీ మంచి యాక్టర్. చాలా ప్రొఫెషనల్. సినిమాలో మా సీన్స్ బాగా వచ్చాయ్. ప్రతి సినిమా సెట్‌లోనూ టీమ్ అంతా కలిసిపోవాలనేం లేదు కదా! నేను ఎవరినీ తక్కువ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడలేదు. మూవీ కోసం 100 శాతం పనిచేశాం. గతంలో నేను చాలామంది హీరోయిన్లతో కలిసి నటించాను. వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హాలతో కలిసి యాక్ట్ చేయడం మర్చిపోలేను. మేం ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లం. జాన్వీతో మాత్రం సినిమా గురించే డిస్కషన్ జరిగింది. అదే రీసెంట్‌గా ఇంటర్వ్యూలో చెప్పా' అని గుల్షన్ దేవయ్య క్లారిటీ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement