ఫిబ్రవరి 18న రెండు సినిమాలు రిలీజ్‌ | Golmaal 2020, Surabhi 70MM Releasing On February 18 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 18న రెండు సినిమాలు రిలీజ్‌

Feb 14 2022 4:12 PM | Updated on Feb 14 2022 4:12 PM

Golmaal 2020, Surabhi 70MM Releasing On February 18 - Sakshi

‘2020 గోల్‌మాల్‌',  ‘సురభి 70 ఎమ్‌ ఎమ్‌’. కేకే చైతన్య నిర్మించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 18న విడుదల కానున్నాయి.

మిట్టకంటి రామ్, విజయ్‌ శంకర్, అక్షితా సోనవానె, మహి మల్హోత్రా, కిస్లే చౌదరి ప్రధాన పాత్రల్లో జాన్‌ జిక్కి దర్శకత్వం వహించిన చిత్రం ‘2020 గోల్‌మాల్‌’. కాగా గంగాధర వైకే అద్వైత దర్శకత్వంలో అనిల్‌ కుమార్, వినోద్‌ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సురభి 70 ఎమ్‌ ఎమ్‌’. కేకే చైతన్య నిర్మించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 18న విడుదల కానున్నాయి.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త తరహా అనుభూతి ఇస్తుంది’’ అన్నారు గోల్‌మాల్‌ దర్శకుడు జాన్‌ జిక్కి. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అన్నారు గంగాధర. ఈ వేడుకల్లో నటుడు మిట్టకంటి రామ్, దర్శకులు చంద్ర మహేశ్, వీఎన్‌ ఆదిత్య, ‘బైలంపూడి’ నిర్మాత బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement