నా కల నెరవేరుతోంది | Goldie Nissi Talks About Changure Bangaru Raja Movie | Sakshi
Sakshi News home page

నా కల నెరవేరుతోంది

Sep 14 2023 1:17 AM | Updated on Sep 14 2023 1:17 AM

Goldie Nissi Talks About Changure Bangaru Raja Movie - Sakshi

‘‘ఛాంగురే బంగారురాజా’ కుటుంబంతో కలిసి హాయిగా చూడదగ్గ సినిమా. ఇందులో మంగరత్నం అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్ర చేశాను. మెకానిక్‌ బంగార్రాజుగా కార్తీక్‌ నటించారు. మా ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. రవితేజగారి నిర్మాణంలో నా మొదటి సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్‌ గోల్డీ నిస్సీ అన్నారు. కార్తీక్‌ రత్నం హీరోగా సతీష్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’.

రవితేజ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోల్డీ నిస్సీ మాట్లాడుతూ–‘‘నేను తెలుగమ్మాయిని. కొన్ని షార్ట్‌  ఫిలిమ్స్‌ చేశాను. హీరోయిన్‌గా నా తొలి సినిమా ‘ఛాంగురే బంగారురాజా’. రవితేజగారిని కలిసినప్పుడు ‘సినిమా చూశాను. నీకు ఇది తొలి సినిమా అయినా భయం లేకుండా నటించావ్‌’ అని మెచ్చుకోవడం హ్యాపీ. నన్ను నేను పెద్ద తెరపై చూసుకోవాలనే కల నెరవేరుతుండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement