డియర్‌ కామ్రేడ్‌ నా ఫస్ట్‌ సినిమా అయ్యుండేది

Gnaneswari Kandregula Speech about Mr & Miss - Sakshi

‘‘నాది వైజాగ్‌. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. ఫ్యాషన్స్, మోడలింగ్‌ అంటే ఇష్టం. లాక్మే ఫ్యాషన్‌ వీక్, మ్యాక్స్‌ ఫెస్టివల్స్‌లో వాక్‌ చేశాను. నా క్లోజ్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ మేరకు నో చెప్పలేక ‘తను’ అనే షార్ట్‌ ఫిలింలో నటించాను.. దానికి బాగా పేరొచ్చింది. ఆ తర్వాత షార్ట్‌ ఫిలిమ్స్, వెబ్‌ సిరీస్, ఇండిపెండెంట్‌ మూవీస్‌లలో ఆఫర్లు వచ్చినా నాకు యాక్టింగ్‌ మీద ఆసక్తి లేక చేయలేదు. బాగా చదవాలన్నది నా కల’’ అని జ్ఞానేశ్వరి కాండ్రేగుల అన్నారు. శైలేష్‌ సన్ని, జ్ఞానేశ్వరి కాండ్రేగుల జంటగా ‘ఓ స్త్రీ రేపు రా’ మూవీ ఫేమ్‌ అశోక్‌ రెడ్డి దర్శకత్వంలో క్రౌడ్‌ ఫండెడ్‌ చిత్రంగా రూపొందిన ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి కాండ్రేగుల మాట్లాడుతూ– ‘‘తను’ షార్ట్‌ ఫిలిం తర్వాత నాకొచ్చిన ఓ మెసేజ్‌తో ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా డైరెక్టర్‌ భరత్‌ కమ్మ గారి ఆఫీసుకు వెళ్లి ఆడిషన్స్‌ లాగా యాక్టింగ్‌ డిస్కషన్స్‌లో పాల్గొన్నాను.

‘అర్జున్‌ రెడ్డి’  బిగ్‌ హిట్‌ అవ్వడంతో కొత్త ఆర్టిస్టులతో చేద్దామనుకున్న వారు కాస్త సీనియర్‌ యాక్టర్స్‌ను తీసుకున్నారు. మొదటిసారి నన్ను అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా ఉంటే నా మొదటి సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’ అయ్యుండేది. అయినా ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’ కూడా ఒక అందమైన చిత్రం. అశోక్‌గారు కథ చెప్పాక, ఇందులో రొమాన్స్‌ ఎక్కువ ఉందని నో చెప్పడంతో ముంబయ్‌ అమ్మాయితో షూట్‌ స్టార్ట్‌ చేశారు. నెల రోజులు బాగా ఆలోచించి ఈ అవకాశం మిస్‌ చేసుకుంటున్నానేమో అని, అశోక్‌గారికి ఫోన్‌ చేసి ఓకే చెప్పాను. దీంతో ముంబయ్‌ అమ్మాయిని వద్దని, నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అందరికీ నచ్చే బ్యూటిఫుల్‌ కమర్షియల్‌ లవ్‌ స్టోరీ ఇది. సిద్ధం మనోహర్‌ విజువల్స్, యశ్వంత్‌ నాగ్‌ సంగీతం మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’ మూవీ తర్వాత తెలుగులో, కన్నడతో పాటు, ఓటీటీలో అవకాశాలు వచ్చాయి.. వాటి వివరాలు త్వరలోనే చెబుతా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top