Varun Tej: పెళ్లిపై వరుణ్‌ తేజ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Ghani Hero Varun Tej Opens Up About Marraige In Recent Interview - Sakshi

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన చిత్రం గని. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం(ఏప్రిల్‌8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సంపాదించుకుంటోంది. ఇదిలా ఉండగా టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో వరుణ్‌ తేజ్‌ కూడా ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్‌ హీరో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కాలేజీ రోజుల్లో లవ్‌స్టోరీ ఉండేది కానీ ఇప్పుడు సీక్రెట్‌ లవ్‌స్టోరీ ఏం లేదని తెలిపాడు. పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు.. చేతిలో చాలా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయని, దీంతో ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని పేర్కొన్నాడు. ఇక ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అన్న దానిపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నాడు. కాగా వరుణ్‌  నటించిన ఎఫ్‌ 3 సినిమా సైతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.చదవండి: వరుణ్‌తేజ్‌ కోసం లావణ్య ట్వీట్‌.. మరోసారి డేటింగ్‌ రూమర్స్‌ తెరపైకి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top