యాక్షన్‌ జెమ్‌ | GEM First Look Launch by Ravi Teja | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ జెమ్‌

Nov 10 2020 6:22 AM | Updated on Nov 10 2020 6:22 AM

GEM First Look Launch by Ravi Teja - Sakshi

నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్‌ రాజా నటించిన తాజా చిత్రం ‘జెమ్‌’. రాశీ సింగ్, నక్షత్ర హీరోయిన్లుగా నటించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో మహాలక్ష్మీ మూవీ మేకర్స్‌ పతాకంపై పత్తికొండ కుమారస్వామి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మోషన్‌ పోస్టర్, ఫస్ట్‌ లుక్‌ని హీరో రవితేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ రాజా మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది.

రెండేళ్లు శ్రమించి సిద్ధం చేసిన కథను అంతే బాగా తెరకెక్కించారు సుబ్రహ్మణ్యంగారు’’ అన్నారు. ‘‘అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించాం’’ అన్నారు సుశీల సుబ్రహ్మణ్యం. ‘‘అవుట్‌పుట్‌ సంతృప్తికరంగా వచ్చింది’’ అన్నారు పత్తికొండ కుమారస్వామి. ‘‘తమిళ, కన్నడలో సినిమాలు చేసిన కుమారస్వామిగారు తెలుగులో మా అబ్బాయితో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement