
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి గౌతమి కపూర్ బీ టౌన్‌లో పరిచయం చేయాల్సిన పనిలేదు. సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. గౌతమి చివరిసారిగా కొరియన్ డ్రామా రీమేక్ అయినా గ్యారహ్.. గ్యారహ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలతో బిజీగా ఉన్న గౌతమి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్నతనంలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.
ముంబయిలో పాఠశాల ఇంటికి వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తాను ఆరో తరగతిలో ఉండగా ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా తన ప్యాంట్ లోపలికి చేయి పెట్టాడని ఆ భయానక అనుభవాన్ని పంచుకుంది. అప్పుడు నా వయసు 12 ఏళ్లు కావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. ఆ తర్వాత భయంతో వెంటనే బస్సుదిగి వెళ్లిపోయానని గౌతమి కపూర్ ఆ చేదు సంఘటనను వివరించింది. ఆ వ్యక్తి నన్ను అనుసరిస్తున్నాడా అని నేను ఆలోచిస్తూనే ఉన్నానని వెల్లడించింది. ఈ విషయాన్ని అమ్మతో చెప్పడానికి భయపడ్డానని గౌతమి చెప్పింది.
ఈ సంఘటన జరిగినప్పుడు తాను తన స్కూల్ యూనిఫాంలోనే ఉన్నానని గౌతమి పంచుకుంది. ఇంటికి వచ్చి నా తల్లికి జరిగిందంతా వివరించానని తెలిపింది. వెంటనే 'నీకు పిచ్చి పట్టిందా? నువ్వు వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి కాలర్ పట్టుకుని ఉండాల్సిందని.. ఎప్పుడూ భయపడవద్దని అమ్మ నాకు ధైర్యం చెప్పిందని తెలిపింది. ఎవరైనా అలా చేస్తే.. వారి చేతిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరవండి.. భయపడకుండా పెప్పర్ స్ప్రే వారి ముఖంపై కొట్టండి అని సలహా ఇస్తోంది బాలీవుడ్ భామ.