చరిత్రలో మిగిలిపోవాలంతే... | Sakshi
Sakshi News home page

చరిత్రలో మిగిలిపోవాలంతే...

Published Sun, May 26 2024 2:45 AM

Gangs of Godavari Trailer Launch

‘మనుషులు మూడు రకాలురా.. నాసి రకం.. రెండోది బోసి రకం.. మూడోది నాణ్యమైన రకం..’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా ట్రైలర్‌. విశ్వక్‌ సేన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా, అంజలి ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్‌లో జరిగింది. ‘‘యువ నాయకుడు రత్నాకర్‌’, ‘నా ఊళ్లో నాకేంట్రా భయం’, ‘ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే..’ అనే డైలాగ్స్‌ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement