అచ్చ తెలుగు కథ | Gaali Sampath Movie Launch | Sakshi
Sakshi News home page

అచ్చ తెలుగు కథ

Nov 17 2020 6:11 AM | Updated on Nov 17 2020 6:11 AM

Gaali Sampath Movie Launch - Sakshi

లవ్‌లీ సింగ్, శ్రీవిష్ణు

దర్శకుడు అనిల్‌ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్‌ జంటగా ‘గాలి సంపత్‌’ చిత్రం ప్రారంభమైంది. టైటిల్‌ రోల్‌ను రాజేంద్ర ప్రసాద్‌ చేస్తున్నారు. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఎస్‌.కృష్ణ, సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్‌కి నారా రోహిత్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు. వరుణ్‌ తేజ్‌ గౌరవ దర్శకత్వం వహించగా, స్క్రిప్ట్‌ను అనీష్‌ కృష్ణకు నిర్మాత ఎస్‌వీసీ శిరీష్‌ అందజేశారు. ‘‘నేనీ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాను’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘‘అచ్చ తెలుగు స్క్రిప్ట్‌ ఇది’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: నాగమోహన్‌ బాబు ఎమ్‌.

Advertisement
 
Advertisement
Advertisement