
పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌పై పనులు ప్రారంభించారు. అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోకి (AA22xA6) హాలీవుడ్ హీరో విల్ స్మిత్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone)తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. ఇలా భారీ తారాగాణంతో ఈ సినిమాను సుమారు రూ. 800 కోట్ల బడ్జెట్తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ చిత్రంలో రష్మిక మందన్న మరోసారి అల్లు అర్జున్తో నటించనుందని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె ఫైనల్ అయ్యారు. అయితే, రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నారు. ఇప్పటికీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. త్వరలో షూటింగ్‌కు యూనిట్ సన్నద్ధం కానుంది. ఈ క్రమంలో తొలి షెడ్యూల్‌ను ముంబయిలో ప్లాన్ చేశారని టాక్ ఉంది.