నేను స్టూడెంట్‌ సార్‌ | Sakshi
Sakshi News home page

నేను స్టూడెంట్‌ సార్‌

Published Sat, Sep 10 2022 2:22 AM

First look of Bellamkonda Ganesh-starrer Nenu Student Sir - Sakshi

బెల్లంకొండ గణేష్‌ హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌!’. డైరెక్టర్‌ తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ‘నాంది’ వంటి హిట్‌ సినిమా నిర్మించిన ‘నాంది’ సతీష్‌ వర్మ ‘నేను స్టూడెంట్‌ సార్‌!’ని నిర్మించారు.

ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘నాంది’ సతీష్‌ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. దర్శకుడు కృష్ణ చైతన్య మంచి కథ అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. సముద్ర ఖని, సునీల్, శ్రీకాంత్‌ అయ్యంగార్, ప్రమోదిని ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: అనిత్‌ మధాడి. 

Advertisement
 
Advertisement
 
Advertisement