సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత | Filmmaker and ex CBFC chairperson Pahlaj Nihalani dies at 76 | Sakshi
Sakshi News home page

Pahlaj Nihalani: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత పహ్లాజ్ మృతి

Jun 4 2026 3:09 PM | Updated on Jun 4 2026 3:58 PM

Filmmaker and ex CBFC chairperson Pahlaj Nihalani dies at 76

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో మృతి చెందారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆయన ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

పహ్లాజ్ నిహలానీ తన కెరీర్‌లో 'ఆంఖేన్', 'అందాజ్', 'తలాష్', 'రంగీలా రాజా', 'జూలీ 2' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 2015 నుంచి 2017 వరకు సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. సెన్సార్‌షిప్, ఫిల్మ్ సర్టిఫికేషన్  బోర్డులో ఆయన ఉన్న సమయంలో, తీసుకున్న అనేక నిర్ణయాలు చిత్ర పరిశ్రమలో చర్చలకు దారితీశాయి.  నిహలానీ నిర్మాతగా వివిధ జానర్‌లకు చెందిన అనేక కమర్షియల్ హిందీ చిత్రాలు నిర్మించారు. హిందీ చిత్ర పరిశ్రమకు  దశాబ్దాల పాటు ఆయన సేవలందించారు. ఆయనకు భార్య నీతా, ముగ్గురు కుమారులు విశాల్, దీపేశ్, చిరాగ్ ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement