సినీ వారసులకు అవార్డుల ప్రదానం

సినీ ప్రముఖుల వారసులను ప్రోత్సహించే విధంగా వడపళనిలోని చక్రం హాల్లో ఆదివారం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహా ఫైనాన్స్ అధినేత అనురాధ జయరామన్, యునైటెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కలైమామణి నెల్‌లైసుందరరాజన్ సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్కే కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ దర్శకుడు కె.భారతీ రాజా వారసుడు నటుడు మనోజ్ భారతీ రాజా, ఆదేశ్ బాలా శరవణన్, గజేష్ నాగేష్, నటి సింధుజ విజీ, సుధా విజయ్, సీనియర్ పాత్రికేయుడు అయ్యప్ప ప్రసాద్, యువ వ్యాఖ్యాత నెల్‌లై ఎస్.విజయ్‌లకు అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్కే కృష్ణన్ మాట్లాడుతూ.. అనురాధ జయరామన్, కలైమామణి నెల్లై సుందర్ రాజన్ ఈ అవార్డుల వేడుక ద్వారా వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. సినీ ప్రముఖుల వారసులను ప్రోత్సహించే విధంగా ఈ అవార్డులను ప్రదానం చేయడం ప్రశంసనీయం అన్నారు. ఇది వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.