రష్మిక జడలో మల్లెపూలు పెట్టిన అభిమాని! | Fan Made Viral Video Of Rashmika Mandanna Wearing Jasmine In Jada | Sakshi
Sakshi News home page

వైరల్‌: రష్మిక మందన్నా జడలో పూలు పెట్టిన ఫ్యాన్‌!

Mar 2 2021 6:52 PM | Updated on Mar 2 2021 8:25 PM

Fan Made Viral Video Of Rashmika Mandanna Wearing Jasmine In Jada - Sakshi

రష్మిక మందన్నా.. షీ సో క్యూట్‌.. షీ సో స్వీట్‌.. షీ సో బ్యూటిఫుల్‌.. అంటూ ప్రతిరోజు ఆమె గురించి అభిమానులు పాడుకుంటూనే ఉంటారు. తెలుగు, తమిళ, హిందీల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా మారింది. ధృవ్‌ సర్జాకు జోడీగా నటించిన ఆమె పొగరు సినిమా ఇటీవలే రిలీజైంది. ఈ క్రమంలో ఓ అభిమాని ఆ సినిమా పోస్టరులో రష్మికను మరింత అందంగా తీర్చిదిద్దాడు. ఆమె కొప్పులో మల్లెపూలు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పోస్టర్‌లో రష్మిక జడకు పూలు అతికించిన అభిమాని నిర్వాకానికి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. మరీ ఇంత అభిమానమా? అని ఆశ్చర్యపడుతున్నారు. కాగా రష్మిక పొగరు సినిమా కన్నడంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. నందన్‌ కిషోర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న రిలీజవగా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

కిరాక్‌ పార్టీతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన ఈ క్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, తమిళంలో కార్తీతో ‘సుల్తాన్‌’ హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను’, అమితాబ్‌ బచ్చన్‌ తో ‘డాడీ’ సినిమాలు చేస్తోంది.

చదవండి: ముంబైలో ఫ్లాట్‌ కొన్న రష్మిక!

భయపెట్టారు; విడాకులపై నోరు విప్పిన అమలాపాల్‌..

తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement