‘ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 వేసవికి వాయిదా

The Family Man Season 2 release postponed to summer - Sakshi

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 ద్వారా వెబ్‌ సిరీస్‌ల ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సమంత. ఫిబ్రవరి 12న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ రిలీజ్‌ కావాలి. అయితే దీన్ని వేసవికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దర్శక ద్వయం రాజ్, డీకే సృష్టించిన సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’. మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. సమంత విలన్‌ పాత్రలో టెర్రరిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ వాయిదా గురించి దర్శకులు మాట్లాడుతూ – ‘‘‘ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 కోసం ఫ్యాన్స్‌ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సూపర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని విడుదలను వేసవికి వాయిదా వేస్తున్నాం’’ అన్నారు. అయితే ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘మిర్జాపూర్‌’, ‘తాండవ్‌’ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్‌’కి అలాంటివి ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ సిరీస్‌ రిలీజ్‌ను వాయిదా వేశారని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top