F3 Movie First Day Box Office Collections, Deets Inside - Sakshi
Sakshi News home page

F3 First Day Box Office Collections: ఊహించని కలెక్షన్స్‌.. ఎంతంటే..?

May 28 2022 2:21 PM | Updated on May 28 2022 3:20 PM

F3 movie First Day Box Office Collection Details - Sakshi

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన తాజా చిత్ర ఎఫ్‌3. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్‌, మురళీ శర్మ, అలీ, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే 27)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. దీంతో తొలిరోజు బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.

(చదవండి: ఎఫ్‌3 మూవీ రివ్యూ)

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 10.35 కోట్లు షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆమెరికాలో ఈ చిత్రం 0.5మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. వారాంతంలోఘీ చిత్రం అక్కడ 1 మిలియన్‌ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఈచిత్రానికి మొత్తంగా రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్‌ ఈవెన్‌కు రూ.64 కోట్ల షేర్‌ రాబట్టాలి.  


ఎఫ్‌3 ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ వివరాలు

నైజాం - రూ.4.06 కోట్లు

సీడెడ్ - రూ.1.26 కోట్లు

ఈస్ట్ - రూ.76 లక్షలు

వెస్ట్ - రూ.96లక్షలు

ఉత్త‌రాంధ్ర - రూ.1.18 కోట్లు

గుంటూరు- రూ.88 లక్షలు

కృష్ణా - రూ. 67 లక్షలు

నెల్లూరు - రూ.62లక్షలు

మొత్తం రూ.10.37కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement