వైవిధ్యం.. వినోదం... | ERROR 500 Movie trailer Launch | Sakshi
Sakshi News home page

వైవిధ్యం.. వినోదం...

Nov 15 2022 4:22 AM | Updated on Nov 15 2022 4:22 AM

ERROR 500 Movie trailer Launch - Sakshi

సాందీప్, జెస్సీ, ఆకాష్‌ పూరి

జస్వంత్‌ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎర్రర్‌ 500’. సాందీప్‌ మైత్రేయ.ఎన్‌ దర్శకత్వంలో యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్‌) నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా దర్శకుడు వీఎన్‌ ఆదిత్య, హీరో ఆకాష్‌ పూరి పాల్గొన్నారు. వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ–‘‘ట్రైలర్‌ బ్రిలియంట్‌గా ఉంది. అలాగే ‘ఎర్రర్‌ 500’ అనేది జెస్సీకి యాప్ట్‌ టైటిల్‌.

ఈ సినిమా రిలీజ్‌ ప్లాన్‌ గురించి సాందీప్‌ని అడిగినప్పుడు సంతోషం సురేష్‌గారు చూశారని చెప్పారు. వెంటనే సినిమా సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉందని చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్‌ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఫణి కల్యాణ్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు’’ అన్నారు జెస్సీ. ‘‘ట్రైలర్‌లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. జెస్సీ చాలా అంకితభావంతో ఈ సినిమా చేశాడు’’ అన్నారు సాందీప్‌. 

Advertisement
 
Advertisement
Advertisement