భయపెడుతున్న 'ఎర్రచీర' మోషన్ పోస్టర్

Erra Cheera Movie Poster Launch - Sakshi

పద్మాలయా ఎంటర్టైన్‌మెంట్స్‌, శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన హర్రర్, యాక్షన్, థ్రిల్లర్ చిత్రం ఎర్రచీర.  నవంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది. రాఖీ పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ గమనిస్తే సినిమాలో భారీ తారాగణంతో సమానంగా ఎర్రచీర ఎలాంటి ముఖ్యపాత్ర పోషించిందో ప్రేక్షకులకు తెలియచేస్తున్నట్టు అనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని ఈ చిత్రం చూస్తున్నంతసేపు హర్రర్ సీన్స్ తో థ్రిల్లింగ్‌ ఉంటుందని, మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్‌గా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ ఎర్ర చీర వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి అంటే నవంబర్ 9న సినిమాని థియేటర్స్‌లో చూడాల్సిందే అని ఆయన అన్నారు.

ఈ సినిమాలో Eight Layers  వారి VFX తో కళ్లుచెదిరే 36 నిమిషాల గ్రాఫిక్స్ తో, మంచి నిర్మాణ విలువలతో నిర్మించబడినదని నిర్మాతలు NVV సుబ్బారెడ్డి, సుమన్ బాబు తెలిపారు. ఎర్రచీర సినిమాలో ప్రధాన పాత్రగా శ్రీరామ్, కేజీఎఫ్‌ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ,  రాజేంద్ర ప్రసాద్  మనవరాలు అయిన మహానటి ఫేమ్ సాయి తేజస్విని, అలీ, రఘుబాబు, గీతాసింగ్, అన్నపూర్ణమ్మ, తదితరులు నటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top