తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈ నగారానికి ఏమైంది. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభివన్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఇందులో సాయి సుశాంత్.. కార్తీక్ పాత్రలో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు.
అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఈ సీక్వెల్ నుంచి సాయి సుశాంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు సుశాంత్‌ను మిస్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయం దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. సుశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నానని పెట్టిన పోస్ట్ చూసి తన గుండె పగిలినంత పనైందని అన్నారు. అయితే కథ సహజంగా సరైన సమయంలో వచ్చిందని.. సుశాంత్ లేకపోయినా కార్తీక్ పాత్ర ఇప్పటికీ కథలో ఉంటుందని సోషల్ మీడియా ద్వారా దర్శకుడు పంచుకున్నారు.
తరుణ్ భాస్తర్ పోస్ట్‌ను ప్రొడ్యూసర్ సృజన్ యరబోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే కార్తీక్‌గా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అలరించిన సుశాంత్‌పై తనకు ఎప్పటికీ ప్రేమాభిమానాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది.



