ee kathalo patralu kalpitam got positive talk said by movie unit - Sakshi
Sakshi News home page

ఈ కథలో పాత్రలు కల్పితం కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది - చిత్ర యూనిట్

Mar 28 2021 12:14 PM | Updated on Mar 28 2021 1:51 PM

Ee Kathalo Patralu Kalpitam Get Positive Talk Movie Unit Says - Sakshi

పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన హీరో హీరోయిన్ లుగా అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈకథలో పాత్రలు కల్పితం'. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో ఈ సినిమా టీమ్ శనివారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో పవన్ తేజ్, హీరోయిన్ మేఘన, నిర్మాత రాజేష్ నాయుడు, దర్శకుడు అభిరామ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ...ఈ సినిమా విడుదలయిన అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతటా పాజిటివ్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విషయంలో కొణిదెల ఫ్యామిలీ హీరో పవన్ తేజ్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మా సినిమాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదనీ అంటున్నారు..కానీ వాళ్ల సపోర్ట్ మొదటినుండి ఉంది. ఈ సినిమా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు అన్నారు.

దర్శకుడు అభిరాం మాట్లాడుతూ.. 'ఈకథలో పాత్రలు కల్పితం సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే నుంచి మంచి టాక్ తో వెళ్తుంది సినిమా.. అందరం కొత్తవాళ్ళం కలిసి చేసిన ఈ సినిమాకి ఇంత మంచి టాక్ వస్తుందని అనుకోలేదు.. మమ్మల్ని ప్రోత్సహించిన ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు.. షో కూడా పెరుగుతున్నాయి. ధియేటర్స్ వైపు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది.. ట్విస్ట్ లు బాగున్నాయని అన్ని వెబ్ సైట్స్ రాస్తున్నాయి. బుక్ మై షో లో కూడా మంచి రేటింగ్స్ ఉన్నాయి.. మా సినిమా కి మీడియా సపోర్ట్ కూడా ఉంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందన్నారు.

హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ.. పెద్ద సినిమా క్వాలిటీ మైంటైన్ చేశామని అందరు అంటున్నారు. మంచి సినిమా ఇది.. అందరికి బాగా రీచ్ అయితే ఇంకా పెద్ద హిట్ అవుతుంది సినిమా అంటున్నారు. ముందునుంచి నాకు సినిమాపై మంచి హోప్ ఉంది.  కానీ ఇంత పెద్దగా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.. అందరం కొత్తవాళ్ళం.. మీ సపోర్ట్ ఉంటేనే పైకివస్తాం.. ఈ మూవీ ఇంతపెద్ద హిట్ అవడానికి కారణమైన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు..

హీరోయిన్ మేఘన మాట్లాడుతూ.. నిన్న రిలీజ్ అయిన మా ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రేటింగ్స్ కూడా బాగా ఉన్నాయి.. మాకు ఇచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.. మీడియా సపోర్ట్ ఉంటే మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది.. సినిమా బాగుంది కాబట్టే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా లేదు.. అది చాలా సంతోషంగా ఉంది.. అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement