ఆరేళ్ల తర్వాత ఓటీటీకి దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే? | Dulquer Salmaan Movie Oka Yamudi Premakatha Streaming In Ott | Sakshi
Sakshi News home page

Dulquer Salmaan: ఓటీటీకి దుల్కర్ సల్మాన్ ప్రేమకథా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jun 5 2025 10:44 AM | Updated on Jun 5 2025 10:44 AM

Dulquer Salmaan Movie Oka Yamudi Premakatha Streaming In Ott

గతేడాది లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్‌ కొట్టిన మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్ నటించిన చిత్రం 'ఓరు యమండన్‌ ప్రేమకథ'. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌కు బీసీ నౌఫల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళంలో అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది.

తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఒక యముడి ప్రేమకథ టైటిల్‌తో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత రావడంతో ఓటీటీ ప్రియులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement