ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Do You Know This Beauty Doing Mud Bath  - Sakshi

ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం నానా తంటాలు పడుతుంటారు. కొందరు కొన్ని మేకప్ ప్రొడక్ట్స్‌ని వాడడం వల్ల మరింత అందంగా కనిపిస్తారు.  లేదంటే మరికొంతమంది సహజసిద్దంగానే బ్యూటీఫుల్‌గా కనిపించాలనుకుంటారు. అందం విషయంలో శ్రద్ధ వహించే వారిలో హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు. మత్తేక్కించే చూపులతో పదునెక్కించే  ఈ భామ‌లు తమ అందాన్ని మ‌రింత మెరుగుప‌ర‌చుకునేందుకు ఎప్పుడూ ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే  బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా శ‌రీరం మరింత నిగారింపుగా మారేందుకు వినూత్నంగా ఆలోచించింది. బురదలోకి దిగి ఒళ్లంగా మట్టి పూసుకొని మ‌డ్ బాత్ చేసింది. ఈ ఫోటోను ఊర్వశి నా ఫేవరెట్‌ మత్‌ బాత్‌ స్పా’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

దీనిని చూసిన నెటిజ‌న్స్ విగ్ర‌హం అనుకున్నాం అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలా చేయ‌డం వల్ల కలిగే లాభాలను కూడా వెల్లడించారు ఊర్వ‌శి. "బాలేరిక్ బీచ్ ఎర్రరేగడి మట్టిని ఆస్వాదిస్తున్నాను. ఇది అద్భుతంగా ఉంది. ఇది రోమన్ ప్రేమ దేవత రోమన్ దేవతల సౌందర్య రహస్యం ఇదేనని చెప్పారు. అందాన్ని మ‌రింత మెరుగుప‌ర‌చుకోవ‌డంతో పాటు శ‌రీరంపై ఉన్న విషపూరిత కణాలు తొలగించుకోవడానికి చాలా కాలం నుండి ఇలా చేస్తున్నానని తెలిపారు. శరీరం మొత్తం రేగ‌డి మ‌ట్టి పూసుకొని కూర్చుంటే శ‌రీరంతో పాటు మ‌న‌సుకు ప్ర‌శాంత‌త ఉంటుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఇక ఇటీవల  జిమ్ వ‌ర్క‌వుట్ వీడియో ఒక‌టి షేర్ చేయ‌గా, ఇందులో జిమ్ ట్రైన‌ర్‌తో క‌డుపులో పిడి గుద్దులు గుద్దించుకున్న విషయం తెలిసిందే.. త‌న త‌ర్వాతి సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో ఆ సినిమా కోసం ఇలా ప్రాక్టీస్ చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

చదవండి: హీరోయిన్‌ కడుపులో ట్రైనర్‌ పిడిగుద్దులు.. వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top