దర్శకుడి పాదాలకు నమస్కరించిన హీరోయిన్‌, వీడియో వైరల్‌ | Divya Khosla Touches Mukesh Bhatt Feet, Video Goes Viral | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాతో హీరోయిన్‌గా.. దర్శకుడి కాళ్లు మొక్కిన బ్యూటీ

May 31 2024 5:11 PM | Updated on May 31 2024 5:45 PM

Divya Khosla Touches Mukesh Bhatt Feet, Video Goes Viral

సీనియర్‌ దర్శకనటుడు ముకేశ్‌ భట్‌ పాదాలకు నమస్కరించింది. వెంటనే ముకేశ్ ఆమెను హత్తుకుని ఆశీర్వదించాడు. ఇం

సమ్మర్‌కు ముగింపు పలుకుతూ ఈ రోజు (మే 31) బోలెడన్ని సినిమాలు రిలీజయ్యాయి. తెలుగులో భజే వాయువేగం, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గంగం గణేశా విడుదలవగా థియేటర్లకు పండగ కళ వచ్చింది. అటు బాలీవుడ్‌లో నిన్న మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రిలీజవగా నేడు 'సవి: ఎ బ్లడీ హౌస్‌వైఫ్‌' మూవీ విడుదలైంది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ చిత్రంలో జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రల్లో నటించగా సవి చిత్రంలో దివ్య ఖోస్లా కుమార్‌ హీరోయిన్‌గా నటించింది.

నేను ఫైటర్‌ను..
తన సినిమా రిలీజ్‌ సందర్భంగా దివ్య.. సీనియర్‌ దర్శకనటుడు ముకేశ్‌ భట్‌ పాదాలకు నమస్కరించింది. వెంటనే ముకేశ్ ఆమెను వద్దని మందలిస్తూ హత్తుకుని ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సినిమా ఫలితాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్‌ మాట్లాడుతూ.. సినిమా విజయం సాధించకపోతే ఏడుస్తూ కూర్చోను. నేనొక ఫైటర్‌ను. జీవితంలో దేనికీ భయపడను. జయాపజయాల గురించి తలుచుకుని కుంగిపోను. ధైర్యంతో ముందడుగు వేస్తుంటాను అని చెప్పుకొచ్చింది.

ఆ పదం తొలగించడంతో..
కాగా దివ్య ఖోస్లా కుమార్‌ ఇటీవల తన పేరులో నుంచి కుమార్‌ అనే పదాన్ని తొలగించింది. దీంతో ఆమె భర్త, టీ సిరీస్‌ యజమాని భూషణ్‌ కుమార్‌తో విడిపోయిందా? అని రూమర్స్‌ వెలువడ్డాయి. దీనిపై వెంటనే స్పందించిన దివ్య.. న్యూమరాలజీ ప్రకారమే ఆ పదాన్ని తొలగించినట్లు వివరణ ఇచ్చింది. 

తెలుగు సినిమాతో ఎంట్రీ
ఇకపోతే దివ్య ఖోస్లా కుమార్‌.. లవ్‌ టుడే అనే తెలుగు చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది. అదే ఏడాది హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్యలో దర్శకురాలిగా, నిర్మాతగానూ ప్రయోగాలు చేసింది. చివరగా యారియాన్‌ 2 సినిమాలో కనిపించింది. ఆమె నటించిన సవి నేడే రిలీజైంది. ప్రస్తుతం హీరో హీరోయిన్‌ అనే ద్విభాషా సినిమా చేస్తోంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement