థియేటర్‌లో హరి | Dirty Hari in Theaters from January 8 | Sakshi
Sakshi News home page

థియేటర్‌లో హరి

Jan 5 2021 12:51 AM | Updated on Jan 5 2021 12:51 AM

 Dirty Hari in Theaters from January 8 - Sakshi

శ్రవణ్‌ రెడ్డి, యం.ఎస్‌. రాజు, గూడూరు సతీష్, జునైద్‌

శ్రవణ్‌రెడ్డి, సిమ్రత్‌ కౌర్, రుహానీ శర్మ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డర్టీహరి’. ఈ సినిమా మొదట ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఫ్రైడే మూవీస్‌ ఏటీటీలో డిసెంబర్‌ 18న, ఆ తర్వాత ఆహాలో విడుదలైంది. ఈ నెల 8న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా యం.ఎస్‌. రాజు మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్‌లో మా సినిమా ప్రేక్షకులకు ఇంకా బెటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని అనుకుంటున్నాను. కంటెంట్‌ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్‌ అవుతుందని ‘డర్టీ హరి’ నిరూపించింది’’ అన్నారు. ‘‘యం.యస్‌. రాజుగారు సినిమా తీసిన విధానం అద్భుతంగా ఉందని సినిమా చూసినవాళ్లందరూ అంటున్నారు’’ అన్నారు శ్రవణ్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement