క్లైమాక్స్‌ కొత్తగా ఉంటుంది | Director Srikanth N Reddy speech at Aadikeshava Movie | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌ కొత్తగా ఉంటుంది

Published Fri, Nov 24 2023 6:36 AM | Last Updated on Fri, Nov 24 2023 6:36 AM

Director Srikanth N Reddy speech at Aadikeshava Movie - Sakshi

వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్ .రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్  ఎంటర్‌టైనర్‌ ‘ఆదికేశవ’. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. శ్రీకాంత్‌ ఎన్ . రెడ్డి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌కి చెందిన ఓ కుర్రాడు అనంతపురం సమీపంలోని కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ఈ సినిమా కథాంశం.

మూవీ ప్రారంభమైన 10 నిమిషాలకే వైష్ణవ్‌తేజ్‌ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. సినిమాలోని చివరి 45నిమిషాల సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా, క్లైమాక్స్‌ కొత్తగా ఉంటుంది. బడ్జెట్, పారితోషికం.. ఇలాంటి అంశాలను పట్టించుకోకుండా నా దృష్టంతా సినిమాపై కేంద్రీకృతమయ్యేలా చేసిన నాగవంశీగారికి థ్యాంక్స్‌. జీవీ ప్రకాష్‌ కుమార్‌ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement