వరుణ్‌ తేజ్‌ సినిమా కోసం సింగర్‌గా మారిన డైరెక్టర్‌ శంకర్‌ కూతురు | Director Shankar Daughter Turns As Singer For Ghani Movie | Sakshi
Sakshi News home page

Aditi Shankar: వరుణ్‌ తేజ్‌ సినిమా కోసం సింగర్‌గా మారిన డైరెక్టర్‌ శంకర్‌ కూతురు

Feb 7 2022 4:47 PM | Updated on Feb 7 2022 6:57 PM

Director Shankar Daughter Turns As Singer For Ghani Movie - Sakshi

Shankar Daughter Turns As Singer : ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్తి సరసన ఆమె నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌మీదుంది. అయితే అదితి హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గానూ పరిచయం అవుతుంది.

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న గని చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ సాంగ్‌ను అదితి పాడింది. ఈ పాటను రేపు(మంగళవారం)రిలీజ్‌ చేయనున్నారు. విజయవాడ కేఎల్‌ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఈ పాటను ఆవిష్కరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement