కల్కి మూవీతో హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి-2 అప్‌డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ చెన్నైలో జరిగిన సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ క్రేజీ న్యూస్ షేర్ చేశారు. కల్కి-2 సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చారు.
కల్కి-2 ఇప్పటికే ప్రారంభమైందని నాగ్ అశ్విన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్ వచ్చేనెలలో మొదలు కానుందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీని మరింత వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నాగ్ అన్నారు. ఏప్రిల్ 2027 నాటికి మెయిన్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.
కాగా.. మొదటి భాగం కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె సైతం అభిమానులను మెప్పించింది. కల్కిలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ కోసం నిర్మాతలు మరింత భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.


