యాత్ర 2.. ప్రేక్షకులు మెచ్చారు: దర్శకుడు | Sakshi
Sakshi News home page

Yatra 2 Movie: యాత్ర 3? దర్శకుడి స్పందన ఇదే!

Published Fri, Feb 9 2024 3:39 PM

Director Mahi V Raghav Comments in Yatra 2 Movie Success Meet - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. 2019లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్‌ స్పందన లభిస్తోంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. 

అందరికీ కృతజ్ఞతలు
శుక్రవారం నాడు హైదరాబాద్‌లో యాత్ర 2 సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మహి వి రాఘవ్‌ మాట్లాడుతూ.. ఈ మూవీ నచ్చిన వాళ్లకు, నచ్చని వాళ్లకు.. అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఎవరి అభిప్రాయాలు వారివని, తనకు అనిపించింది చెప్పానన్నాడు. ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ మాత్రం బాగుందన్నాడు. యాత్ర 2 కమర్షియల్‌ ఫిలిం కాదని మరోసారి నొక్కి చెప్పాడు.

(యాత్ర 2 సినిమా రివ్యూ)

అప్పుడే అనుకున్నా
ఈ చిత్రం కోసం పని చేసిన టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలియాజేశాడు. నిజానికి ఈ మూవీ చేయాలని 2019లోనే అనుకోగా.. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చిందన్నాడు. ప్రస్తుతానికైతే యాత్ర 3 గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని తెలిపాడు. కాగా యాత్ర 2లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాత్రలో జీవా నటించారు. వైఎస్‌ భారతిగా కేతకి నారాయణ్‌ పాత్రలో ఒదిగిపోయారు.

చదవండి: 'హనుమాన్‌' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ వైరల్‌

Advertisement
 
Advertisement