Director Chandra Siddhartha Launched Anantha Teaser - Sakshi
Sakshi News home page

Anantha Teaser: డైరెక్టర్‌ చంద్ర సిద్దార్థ చేతుల మీదుగా అనంత టీజర్‌

Nov 11 2022 6:43 PM | Updated on Nov 11 2022 7:03 PM

Director Chandra Siddhartha Launched Anantha Teaser - Sakshi

'ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశాం. కథ వినగానే ప్రశాంత్ ముందుకొచ్చి ఈ సినిమా చేశారు. ఈ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడంతో పాటు నాలెడ్జ్ పంచుతుంది. ఇది గ్లోబల్ సబ్జెక్టుతో రాబోతోంది.

ప్రశాంత్ కార్తీ, రిత్తిక చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అనంత. ఈ చిత్రానికి మధు బాబు దర్శకత్వం వహిస్తుండగా ఏ ప్రశాంత్ నిర్మిస్తున్నారు. అనీష్ కురువిళ్ళ, లయ సింప్సన్, శ్రీనివాస్ జే గడ్డం, రమేష్.కే, అనిల్ కుమార్, కీర్తి ముఖ్యపాత్రలు పోషిస్తుండగా ఘంటసాల విశ్వనాధ్ సంగీతం అందిస్తున్నారు. సిద్దు సోమిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్థ చేతుల మీదుగా అనంత టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో సినిమా సోల్ ఏంటనేది స్పష్టమయ్యేలా ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. ఈ టీజర్ చూసిన డైరెక్టర్ చంద్ర సిద్దార్థ.. సినిమా చాలా బాగా వచ్చిందని అర్థమవుతోందని అన్నారు. ఈ టీజర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ సినిమా కాదని, డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేస్తూ ఈ అనంత రూపొందించారని తెలుస్తోందన్నారు.

చిత్ర దర్శకులు మధు బాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశాం. కథ వినగానే ప్రశాంత్ ముందుకొచ్చి ఈ సినిమా చేశారు. ఈ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడంతో పాటు నాలెడ్జ్ పంచుతుంది. ఇది గ్లోబల్ సబ్జెక్టుతో రాబోతోంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

చదవండి: విషాదం, జిమ్‌లో వర్కవుట్‌ చేస్తూ నటుడు మృతి

Advertisement
 
Advertisement
Advertisement