Director Bala and His Wife Muthumalar Get Divorced - Sakshi
Sakshi News home page

మరో స్టార్ డైరెక్టర్ విడాకులు...18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి!

Mar 8 2022 3:12 PM | Updated on Mar 8 2022 9:39 PM

Director Bala And Muthumalar Get Divorced - Sakshi

చిత్ర పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సమంత, ధనుష్‌, అమీర్‌ ఖాన్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకివ్వగా.. తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌ భార్యతో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్‌ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్‌కు డివోర్స్‌ ఇచ్చాడు. దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి నేటితో తెరపడింది.

గత నాలుగేళ్లుగా బాల, మధుమలార్‌ విడి విడిగా ఉంటున్నారు. మ్యూచువల్ విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది. ఇక దర్శకుడి బాల.. తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడు. ఆయన దర్శకత్వం వహించిన శివపుత్రుడు, శేషు, వాడు- వీడు చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.  అలాగే 2008లో బాల 'నాన్ కాదవుల్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.  తాజాగా సూర్యతో  ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement