ఇప్పటికైనా దిల్‌ రాజుకు ఆ లోటు తీరేనా? | Dil Raju Is Full Confident That Thankyou Movie Will Be A success | Sakshi
Sakshi News home page

ఎన్ని బ్లాక్‌ బస్టర్స్‌ అందుకున్నా.. దిల్‌ రాజుకు మాత్రం ఆ లోటు తీరలేదట!

May 31 2022 2:57 PM | Updated on May 31 2022 2:57 PM

Dil Raju Is Full Confident That Thankyou Movie Will Be A success - Sakshi

నిర్మాతగా దిల్‌ రాజు జర్నీ 2003లో ప్రారంభమైంది. తక్కువ కాలంలో అగ్ర నిర్మాతగా స్థాయికి ఎదిగాడు.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఫ్యూచర్ లో ఒక బాహుబలి, ఒక కేజీయఫ్ రేంజ్ ప్రాజెక్ట్స్‌ని తన బ్యానర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేయవచ్చు అంటున్నాడు. ఎంత ఎదిగినా, ఎన్ని బ్లాక్ బస్టర్స్ అందుకున్నా ఒక్క లోటు మాత్రం దిల్ రాజును కొంతకాలంగా వెంటాడుతూ వస్తోంది. ఆ లోటు జులై 8తో తీరిపోతుందనే ధీమాతో ఉన్నాడు దిల్‌ రాజు. 

ఆ లోటు ఏంటంటే.. పుష్కరకాలం కింద దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన జోష్ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. అప్పటికే ఆర్య, దిల్ , భద్రా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో వరుస విజయాలతో ఊపుమీదున్నాడు దిల్ రాజు.అందుకే నాగ చైతన్య డెబ్యూట్ బాధ్యతను దిల్ రాజు చేతిలో పెట్టాడు నాగార్జున.వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అప్పటి నుంచి నాగచైతన్యతో సినిమాలు చేయలేదు దిల్‌ రాజు. అందుకు కారణం రెండోసారి చైతన్యతో వర్క్ చేస్తే మాత్రం అతనికి తప్పకుండా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే పట్టుదలతో ఇంత కాలం వెయిట్ చేస్తూ వచ్చాడు.

మొత్తానికి అక్కినేని హీరోలకు మనం లాంటి క్లాసిక్ మూవీని అందించిన విక్రమ్ కుమార్ దిల్ రాజు వెయిటింగ్ కు ఎండ్ పలికాడు.కేవలం చైని దృష్టిలో పెట్టుకుని రాసుకొచ్చిన థ్యాంక్యూ సబ్జెక్ట్ దిల్ రాజుకు బాగా నచ్చింది.అందుకే ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు.జులై 8న థ్యాంక్యూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజు అండ్ టీమ్ రిలీజ్ చేసిన థ్యాంక్యూ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.తన కెరీర్‌లో ఎంతో మంది హీరోలకు సూపర్‌ హిట్‌ అందించిన దిల్‌ రాజు.. చైకి కూడా బ్లాక్‌ బస్టర్‌ అందిస్తాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement