కోటి రూపాయల బోనస్.. దురంధర్‌ యాక్టర్‌ రియాక్షన్ | Dhurandhar 2 Actor Rakesh Bedi Responds On 1 Crore Bonus | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: కోటి రూపాయల బోనస్.. దురంధర్‌ యాక్టర్‌ రియాక్షన్

Apr 24 2026 4:06 PM | Updated on Apr 24 2026 4:25 PM

Dhurandhar 2 Actor Rakesh Bedi Responds On 1 Crore Bonus

రణ్‌వీర్‌ సింగ్ దురంధర్‌-2 నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బద్దలు కొట్టిన ఈ సినిమా బాహుబలి-2 రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్‌ కావడంతో దురంధర్‌ నటీనటులు ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయారు. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాకేశ్ బేడీ. ఈ మూవీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జమిల్ జమాలి పాత్రలో తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు.

ఈ సినిమాలో నటించిన రాకేశ్ బేడీకి పారితోషికం దాదాపు రూ.50 లక్షలు తీసుకున్నారని టాక్. అయితే తాజాగా ఆయనకు సంబంధించి మరో న్యూస్ వైరలవుతోంది. దురంధర్-2 బ్లాక్‌బస్టర్ కావడంతో ఏకంగా ఆయనకు కోటి రూపాయలు ముట్టజెప్పారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాకేశ్ బేడీకి కోటి రూపాయల చెక్ కూడా అందజేశారని వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాకేశ్ బేడీ స్పందించారు. తనకు కోటి బోనస్ ఇచ్చారని వస్తోన్న వార్తలపై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. నాకు ఆ డబ్బు ఇచ్చి ఉంటే ఎక్కడుందో చెప్తే వెళ్లి తెచ్చుకుంటానని అన్నారు. నా ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదన్నారు. దీంతో కోటి రూపాయలు ఇచ్చారన్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని అర్థమవుతోంది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement