
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం 'కేడీ ది డెవిల్' రాబోతుంది. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయిన కన్నడ త్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్–2, విక్రాంత్ రోణా, చార్లీ 777, కాంతార తదితర చిత్రాలు ఇతర పరిశ్రమలను కన్నడం వైపు తిరిగి చూసేలా చేశాయి.
ధృవ సర్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీలక పాత్ర పోషించారు. ఆపై శిల్పాశెట్టితోపాటు రవిచంద్రన్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ కోనంకి, నిషా వెంకట్ కోనంకి నిర్మించారు.