
టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ లేటెస్ట్ మూవీ 'ధీర'. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు తదితర సినిమాల తర్వాత లక్ష్ చేస్తున్న చిత్రమిది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)
ఈ టీజర్‌లో మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ దట్టించారు. దీనిబట్టి చూస్తే సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఉండనుందని తెలుస్తోంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇకపోతే 'ధీర' మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కూడా ముగించుకుని.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.
(ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ)