Dheera Review: ‘ధీర’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Dheera Review: ‘ధీర’ మూవీ రివ్యూ

Published Fri, Feb 2 2024 3:03 PM

Dheera Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ధీర
నటీనటులు: లక్ష్ చదలవాడ, నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర 
నిర్మాత: పద్మావతి చదలవాడ
రచన, దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ:  కన్నా పీసీ
ఎడిటర్: వినయ్ రామస్వామి
విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024

కథేంటంటే.. 
వైజాగ్‌కు చెందిన రణ్‌ధీర్‌(లక్ష్‌ చదలవాడ)కు డబ్బు పిచ్చి ఎక్కువ. ఏ పని ఫ్రీగా చేయడు. మనీ కోసం ఎంతటి సాహసం అయినా చేస్తాడు. అలాంటి వ్యక్తికి ఓ రోజు ప్రముఖ ఆస్పత్రి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. రాజ్‌గురు అనే పేషెంట్‌ని అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తీసుకెళ్తే.. పాతిక లక్షలు ఇస్తామని చెబుతారు. ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో రణ్‌ధీర్‌ వెంటనే ఓ‍కే చెబుతాడు. ఆ పేషెంట్‌ని చూసుకోవడానికి డాక్టర్‌ అమృత(నేహా పఠాన్‌)వస్తుంది. తోడుగా మరో డాక్టర్‌ (మిర్చి కిరణ్‌) వెళ్తాడు. ఈ ముగ్గురితో కలిసి అంబులెన్స్‌లో హైదరబాద్‌కి బయలుదేరిన రణ్‌ధీర్‌పై ఓ ముఠా దాడికి ప్రయత్నిస్తుంది.

రాజ్‌గురును ఎలాగైనా హైదరాబాద్‌కు తరలించకుండా చూడడమే ఆ ముఠా టార్గెట్‌. మరోవైపు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవిలో ఉన్న హంసలేఖ దేవి(హిమజ).. ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలంటూ నమ్మకస్తుడైన పోలీసు అధికారి(భరణి శంకర్‌)ని పంపిస్తుంది. అసలు రాజ్‌ గురు ఎవరు? ఓ ముఠా ఎందుకు అతనిపై దాడికి ప్రయత్నిస్తుంది? వారిని రణ్‌ధీర్‌ ఎలా ఎదుర్కొన్నాడు? రాజ్‌గురును హైదరాబాద్‌ తరలించారా లేదా? హంసలేఖ ఎవరు? ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలని ఎందుకు ఆదేశించింది? ఆ పాపకు రాజ్‌గురుకు ఉన్న సంబంధం ఏంటి? రాజ్‌గురుకు ముఖ్యమంత్రి(సుమన్‌)తో ఉన్న సంబంధం ఏంటి? అసలు రాజ్‌గురు ఏ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు? పాప కోసం రణ్‌ధీర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అమృత, మనీషా(సోనియా బన్సాల్)లతో రణ్‌ధీర్‌ లవ్‌స్టోరీ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ధీర’ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
రాజకీయ నేపథ్యంతో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు.. రెండు డిఫరెంట్‌ లవ్‌స్టోరీలు, భారీ యాక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ ఉన్నాయి. అయితే దర్శకుడు పేపర్‌పై బలంగా రాసుకున్న స్టోరీని అంతే బలంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు.  హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్‌ వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. రాజ్‌గురు స్టోరీ ఏంటనేది మాత్రం చివరి వరకు ప్రేక్షకుడు పసిగట్టకుండా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్‌గురుని హైదరాబాద్‌కు తరలించేందుకు డాక్టర్లు ప్రయత్నించడం.. మరోవైపు హంసలేఖ ఫోన్‌ ద్వారా వైద్యులకు సూచనలు ఇవ్వడం..ఇలా చాలా ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. లక్ష్‌ ఎంట్రీ స్టార్‌ హీరో రేంజ్‌లో ఉంటుంది. కారు రేసింగ్‌ సీన్‌తో హీరో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో తెలియజేశాడు. మీనాక్షితో రణ్‌ధీర్‌ లవ్‌స్టోరీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. హీరో లవ్‌స్టోరీలోని ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక మరింత ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తుంది. ఓ భారీ యాక్షన్‌.. రొమాంటిక్‌ సీన్స్‌.. ఇంట్రెస్టింగ్‌ లవ్‌స్టోరీతో ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఒక్కో ట్విస్టు రివీల్‌ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని నడించాడు. పాప ఎవరు? ఆమె కోసం వెతుకుతున్నదెవరు అనేది తెలుసుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది.  క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో లక్ష్య్‌. సినిమా సినిమాకి తన పాత్రలో వేరియష్‌ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. ధీరలో కూడా రణ్‌ధీర్‌ అనే మరో డిఫరెంట్‌ పాత్రను పోషించి మెప్పించాడు.  యాక్షన్‌ సీన్స్‌ అయితే అదరగొట్టేశాడు. రొమాంటిక్‌ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు.  డాక్టర్‌ అమృతగా నేహా పఠాన్, మనీషాగా సోనియా బన్సాల్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. మిర్చి కిరణ్‌ కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. కన్నా పీసీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్సాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement