
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ల హవా నడుస్తోంది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలు మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. గతవారం మహేశ్ బాబు ‘ఖలేజా’ మూవీ రీరిలీజైంది. ఇక ఈ వారం మంచు విష్ణు ‘ఢీ’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది.
2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర, బ్రహ్మానందం కామెడీ, సునీల్ ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్‌కు కాసుల వర్షం కురిసింది. విష్ణు మంచు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఢీ’ మూవీనీ జూన్ 6వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. దీని కంటే ముందే ‘ఢీ’తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. మరి ఈ రీరిలీజ్ ‘కన్నప్ప’కు కలిసొస్తుందో లేదో చూడాలి.
Join the party on 6th! pic.twitter.com/MEpa36lVAZ
— Vishnu Manchu (@iVishnuManchu) June 2, 2025