క్రేజీ ప్రాజెక్ట్‌.. కొడుకును హీరోగా పరిచయం చేయనున్న ధనుష్? | Dhanush Son Yatra to Debut in Movies | Sakshi
Sakshi News home page

క్రేజీ ప్రాజెక్ట్‌.. కొడుకును హీరోగా పరిచయం చేయనున్న ధనుష్?

Jun 16 2026 11:22 PM | Updated on Jun 16 2026 11:46 PM

Dhanush Son Yatra to Debut in Movies

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌. మరోవైపు వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ విలక్షణ డైరెక్టర్‌గానూ రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ధనుష్ త్వరలోనే ఓ సరికొత్త సాహసానికి తెరలేపబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ హీరో మరోసారి దర్శకుడిగా మారి తన తనయుడ్ని హీరోను చేయబోతున్నాడని సమాచారం.

ధనుష్ తన కుమారుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు యాత్ర రాజాను హీరోగా పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఆయనే దర్శకత్వం కూడా చేస్తాడట. ఒక స్టార్ హీరో తన కుమారుడిని హీరోగా లాంచ్ చేయడం కొత్త విషయం కాదు. కానీ ఒకవైపు దర్శకుడిగా మరోవైపు కొడుకును హీరోగా పరిచయం చేస్తూ, ఈ సినిమాను తానే నిర్మిస్తాడట ధనుష్. దాంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. కాగా ఇప్పటికే యాత్ర నటన, డ్యాన్స్‌లలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతనితో ఓ టెస్ట్ షూట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.

రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్, హీరో ధనుష్‌ల పెద్ద కుమారుడు యాత్ర రాజా. ధనుష్- ఐశ్వర్య భార్యభర్తలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కానీ తల్లిదండ్రులుగా మాత్రం పిల్లల భాద్యతను కలిసే పంచుకుంటున్నారు. ఇక యాత్రను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ధనుష్ చాలా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తన కుమారుడిని హీరో చేసే భాద్యతను మరో దర్శకుడి చేతిలో పెట్టకుండా తనే ఈ దర్శకత్వం చేసే భాద్యతను తీసుకుంటున్నట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement