మురళీధరన్‌గా ధనుష్‌?

Dhanush selected for the Muttiah Muralitharan biopic - Sakshi

ప్రముఖ శ్రీలంకన్‌ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ అనుకోకుండా వివాదంలో ఇరుక్కుంది. మురళీధరన్‌గా తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తారని ప్రకటించారు. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు యంఎస్‌ శ్రీపతి దర్శకుడు. ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదలయింది. అయితే విజయ్‌ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని తమిళులు సోషల్‌ మీడియా ద్వారా నిరసన తెలియజేశారు. మురళీధరన్‌కి తమిళ మూలాలున్నప్పటికీ  ఒక్కసారి కూడా తమిళ సమస్యలకు మద్దతుగా మాట్లాడలేదు, నిలబడలేదు అన్నదే ఆ నిరసనకు కారణం. 

పలువురు దర్శకులు కూడా సేతుపతిని తప్పుకోమని కోరారు. ‘నా వల్ల నువ్వు ఇబ్బందిపడొద్దు. ఈ సినిమా నుంచి తప్పుకో’ అని విజయ్‌ సేతుపతికి ఓపెన్‌ లెటర్‌ రాశారు మురళీధరన్‌. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు చేస్తారనే చర్చ నడుస్తోంది. తాజాగా మురళీధరన్‌ పాత్రకు ధనుష్‌ పేరుని పరిశీలిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. మరి ధనుష్‌ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా? వేచి చూడాలి. అసలు మురళీధరన్‌ బయోపిక్‌ తెరకెక్కుతుందా? అనే సందేహం కూడా పలువురిలో ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top