Dhanush: శివశంకర్ మాస్టర్‌కు ధనుష్ సాయం!.. టాలీవుడ్ స్టార్స్‌పై నెటిజన్ల విమర్శలు

Dhanush Extend Support To Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఆయన పరిస్థితి తెలుసుకొని నటుడు సోనూసూద్ సాయం చేసేందకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం.
అంతేకాకుండా తాను డబ్బులు ఇచ్చిన విషయం గురించి పబ్లిసిటీ చేయవద్దని ధనుష్ కోరినట్లు తెలుస్తుంది. సాయం చేసినా ఎవరికి చెప్పొద్దని కోరడం ధనుష్ మంచి మనసుకు నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే టాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హిట్ పాటలకు కొరియోగ్రాఫీ చేసిన ఆయనకు టాలీవుడ్ నుంచి స్పందన లేకపోవడం ఏంటని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
ధనుష్‌ని చూసి టాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో వందల సంఖ్యలో పాటలకు కొరియోగ్రాఫీ చేసిన శివశంకర్ మాస్టర్ పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా సైతం వ్యవహరించిన సంగతి తెలిసిందే.