'దేవర' ట్రైలర్‌ విడుదలపై జూ ఎన్టీఆర్‌ ప్రకటన | Devara Trailer Date Is Locked | Sakshi
Sakshi News home page

'దేవర' ట్రైలర్‌ విడుదలపై జూ ఎన్టీఆర్‌ ప్రకటన

Published Sat, Sep 7 2024 10:56 AM | Last Updated on Sat, Sep 7 2024 2:07 PM

Devara Trailer Date Is Locked

జూ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర. వినాయకచవితి సందర్భంగా ట్రైలర్‌ విడుదల తేదీని తారక్‌ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్‌ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, దేవర ట్రైలర్‌ ఎప్పుడు విడుదల అవుతుందా అని సోషల్‌ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్న సమయంలో తారక్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవర ట్రైలర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది.  సెప్టెంబర్‌ 10న దేవర ట్రైలర్‌ చేస్తున్నట్లు తారక్‌ ప్రకటించారు. బాలీవుడ్‌లో దేవర మార్కెట్‌ పెంచుకునేందుకు ముంబైలో ఒక భారీ ఈవెంట్‌ ఏర్పాటు చేసి అక్కడ ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. కాగా ఒవర్సీస్‌లో అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ దేవర అదరగొడుతుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్‌ స్టార్ట్ చేశారు. USA, కెనాడాలో టికెట్లు ఓపెన్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ప్రీ సేల్స్‌ బుకింగ్స్‌ ద్వారానే ఇప్పటికి సుమారు రూ. 6 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే  కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను దేవర దాటేశాడు. ఇంకా రిలీజ్ కు 20 రోజుల ముందుగానే ఈ రికార్డ్స్‌ను తారక్‌ నమోదు చేశాడు .

దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో  మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుండగా సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో, నరైన్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement