'దేవర'కు భారీ లాభాలు.. గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత | Devara Movie Distributors Celebrate Profit Party | Sakshi
Sakshi News home page

'దేవర'కు భారీ లాభాలు.. గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత

Oct 18 2024 4:09 PM | Updated on Oct 18 2024 4:19 PM

Devara Movie Distributors Celebrate Profit Party

ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. ఈ చిత్రం విజయంతో హీరో ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా  చాలా హ్యాపీగా ఉన్నారు. దేవర వల్ల భారీ లాభాలు రావడంతో వారందరూ గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత నెల 27న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 509 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్‌ తెలిపారు.

దేవర విజయం వల్ల థియేటర్‌ ఓనర్ల నుంచి క్యాంటీన్‌ నిర్వాహకుల వరకు అందరూ లాభపడ్డారని  ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు తాను కూడా సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దేవర వల్ల చాలామంది లాభ పడ్డారని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో కలిసి నాగవంశీ ఒక పార్టీ చేసుకున్నారు. ఈమేరకు వారందరూ దుబాయ్‌ వెళ్లారట. దేవర విజయంతో భారీ లాభాలు రావడం వల్ల చాలా ఆనందంతో దుబాయ్‌లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నారట.

వరల్డ్ వైడ్‌గా మూడు వారాల్లో దేవర సినిమాకు రూ. 509 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికీ దేవర కలెక్షన్ల విషయంలో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు బాగానే రన్‌ అవుతున్నాయి.  183 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన దేవర.. ఆ మార్క్‌ను ఎప్పుడో అందుకున్నాడు. మూడు వారాలకే సుమారు రూ. 80 కోట్ల నెట్‌ కలెక్షన్ల లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement