ఆస్పత్రి పాలైన 'దేవర' విలన్.. ఇంతకీ కారణం ఏంటంటే? | Devara Movie Actor Saif Ali Khan Undergoes Tricep Surgery | Sakshi
Sakshi News home page

Saif Ali Khan: అప్పటి గాయం తిరగబెట్టింది.. చివరకేమో ఇప్పుడు సర్జరీ!

Jan 22 2024 7:24 PM | Updated on Jan 22 2024 7:43 PM

Devara Movie Actor Saif Ali Khan Undergoes Tricep Surgery  - Sakshi

'దేవర' సినిమాలో విలన్‌గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలయ్యాడు. బాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. గతేడాది 'ఆదిపురుష్' విలన్‌గా నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే షూటింగ్‌లో భాగంగా ఈ మధ్య సైఫ్‌కి గాయాలయ్యాయని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇతడు ఆస్పత్రిలో చేరడంతో అది నిజమని తేలింది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి)

ప్రస్తుతం 'దేవర' షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే కొన్నాళ్ల ముందు యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు విలన్‌గా చేస్తున్న సైఫ్.. మోకాలి, భూజానికి గాయాలయ్యాయట. అయితే అప్పుడు పెద్దగా తెలియలేదు గానీ ఇప్పుడు ఆ గాయాలు సీరియస్ కావడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరాడు. అయితే గతంలో సైఫ్‌కి గాయమైందట. తాజాగా అది తిరగబెట్టడంతో ట్రైసప్(కండ) సర్జరీ కచ్చితంగా చేయాల్సి వచ్చిందట. అలా ఇప్పుడు ఆ శస్త‍్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో హీరోగా అప్పట్లో హిట్స్ కొట్టిన సైఫ్.. ఇప్పుడు సరైన సినిమాలు పడకపోయేసరికి రూట్ మార్చాడు. ప్రతినాయక పాత్రలైనా సరే ఒప్పుకొంటున్నాడు. అలా గతేడాది ప్రభాస్‌ 'ఆదిపురుష్'లో రావణుడిగా కనిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' చిత్రంలో భైరా అనే పాత్రలో నటిస్తున్నాడు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

Advertisement
 
Advertisement
Advertisement