రాజమౌళిగారు నాకు జీవితం ఇచ్చారు: దేవ్‌ గిల్‌ Dev Gill Interesting Comments On SS Rajamouli Sakshi
Sakshi News home page

రాజమౌళిగారు నాకు జీవితం ఇచ్చారు: దేవ్‌ గిల్‌

Jun 21 2024 9:19 AM | Updated on Jun 21 2024 10:23 AM

Dev Gill Interesting Comments On SS Rajamouli

‘‘నా స్వస్థలం పుణే. ముంబైలో ఉన్న నన్ను ‘మగధీర’ మూవీ కోసం రాజమౌళిగారు హైదరాబాద్‌కి తీసుకొచ్చి, నాకు జీవితం ఇచ్చారు. రాజమౌళి, రమా రాజమౌళిగార్ల వల్లే ఈ రోజు ‘అహో విక్రమార్క’లో హీరోగా నటించి, నిర్మించగలిగాను. ఇందుకు నాకు ఆనందంగా ఉంది’’ అని దేవ్‌ గిల్‌ అన్నారు. ‘మగధీర’ చిత్రంలో రామ్‌చరణ్‌కి ప్రతినాయకుడిగా నటించిన దేవ్‌ గిల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన హీరోగా పేట త్రికోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘అహో విక్రమార్క’. దేవ్‌ గిల్‌ ప్రొడక్షన్స్‌పై దేవ్‌ గిల్‌ భార్య ఆర్తి ఈ మూవీ నిర్మించారు. 

ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. దేవ్‌ గిల్‌ మాట్లాడుతూ– ‘‘మగధీర’ నుంచి తెలుగు ప్రేక్షకులు నాపై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. నన్ను ఇంతవరకు విలన్‌గా చూశారు. ‘అహో విక్రమార్క’తో హీరోగా మీ అందరికీ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాను’’ అన్నారు. ‘‘మా ్ర΄÷డక్షన్‌ నుంచి వస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది... ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఆర్తి. పేట త్రికోటి మాట్లాడుతూ– ‘‘దేవ్‌ గిల్‌కి ΄ోలీస్‌ కథ సరి΄ోతుందని భావించి, ఈ సినిమా తీశాం. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘త్రికోటి, దేవ్‌ గిల్‌గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు హీరోయిన్‌ చిత్రా శుక్లా. నటులు యువరాజ్, ప్రవీణ్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement