Dejavu : అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆకట్టుకుంటున్న ‘డెజావు’

Dejavu Movie Streaming On OTT Amazon Prime Video - Sakshi

అరుల్‌నిథి, మధుబాల, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మిమే గోపి ప్రధాన పాత్రల్లో నటించిన మస్టరీ థ్రిల్లర్‌ చిత్రం ‘డెజావు’. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ తమిళ్‌ మూవీ తెలుగు వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కంటెంట్ ప్రధానంగా, . గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో అరవింద్‌ శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 

ఒక నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించినప్పుడు ఏమి జరుగుతుంది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమి జరుగుతుంది?.. అనేదే డెజావు చిత్రం. ఈ కథలో పోలీసు ఇన్వెష్టిగేషన్ ప్రారంభం కావడం, హత్యలు, ఇతర ఘోరమైన ఘటనలు చోటుచేసుకోవడం.. చిత్రంపై ఉత్కంఠను తారాస్థాయికి చేరుస్తుంది. చివరి వరకు కూడా దర్శకుడు ఈ చిత్రాన్ని సస్పెన్స్‌తో నడిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  ఈ విధమైన నాణ్యమైన కంటెంట్, థ్రిల్లింగ్ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో భవాని డీవీడీ ఇంక్ పై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ ప్రశంసలు అందుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top