ప్రేమలో పడ్డ దీప్తి సునయన.. క్యూట్‌ పిక్స్‌తో అసలు విషయం చెప్పిన బిగ్‌బాస్‌ బ్యూటీ

Deepthi Sunaina Fall In love With Learning, Cute Pics Goes Viral - Sakshi

యూట్యూబ్‌ స్టార్‌ దీప్తి సునయన సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. హాట్‌ ఫోటోలతో పాటు క్యూట్‌ వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తుంది. కవర్‌ సాంగ్స్‌, ప్రైవేట్‌ ఆల్భమ్స్‌తో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ... బిగ్‌బాస్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌తో ప్రేమాయణం.. బ్రేకప్‌లతో దీప్తి పేరు నెట్టింట మార్మోగిపోయింది. 

షన్నూతో బ్రేకప్‌ తర్వాత దీప్తి నెట్టింట మరింత యాక్టివ్‌ అయింది. రోజు అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఏదో ఒక విషయం గురించి చెబుతుంది. ఇక తాజాగా తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది ఈ బ్యూటీ. అయితే ఆమె ప్రేమించింది వ్యక్తిని కాదు.. పుస్తకాలను అట. బుక్స్‌తో ప్రేమలో పడినట్లు వెల్లడిస్తూ.. పెట్‌తో ఉన్న క్యూట్‌ పిక్స్‌ని షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top